రేపు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే ప్రధాన అంశాలివే!

by Jakkula Mamatha |
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే ప్రధాన అంశాలివే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సచివాలయంలో రేపు(గురువారం) కేబినెట్ భేటీ(Cabinet Meeting) జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో కొత్త సంవత్సరం(New Year)లో ప్రారంభించాల్సిన పథకాలు(Scheme), ఇతర అభివృద్ధి కార్యక్రమాల(Development Programs)పై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబు విజయవాడ(Vijayawada), విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు పై జిందాల్ ప్రతినిధులతో భేటీ కానున్నారని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed