SSC: ఢిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్ ఎస్‌ఐ పేపర్-2 పరీక్ష తేదీని ప్రకటించిన ఎస్‌ఎస్‌సీ

by Maddikunta Saikiran |
SSC: ఢిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్ ఎస్‌ఐ పేపర్-2 పరీక్ష తేదీని ప్రకటించిన ఎస్‌ఎస్‌సీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పోలీస్‌(Delhi Police), సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్(CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024కు సంబంధించి నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) గత ఏడాది మార్చిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో ఎస్‌ఐ(SI) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 4,187 ఖాళీలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పేపర్-1 పరీక్షలు 2023 మేలో నిర్వహించగా.. తాజాగా పేపర్-2 ఎగ్జామ్ డేట్(Exam Date)ను ప్రకటించింది. మార్చి 8న ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహించనున్నారు. సీబీటీ(Paper-1,2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషీయెన్సీ టెస్ట్(PET), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎస్‌ఐ పోస్టులకు సెలెక్ట్ చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed