- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘనంగా అయ్యప్ప స్వామి 42వ మహా పూజ
దిశ, మక్తల్: మక్తల్ పట్టణ కేంద్రంలో బుధవారం అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి 42వ మహా పూజ భక్తుల శరణు ఘోషతో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు గణపతి హోమంతో ప్రారంభమై ఏడు గంటలకు అయ్యప్ప మహా పూజకు అంకురాపురం జరిగింది. ఎనిమిది గంటలకు ఆజాద్ నగర్ లోని ఈశ్వరాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన అశ్వ రథవాహనంలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పూలతో అలంకరించి కలశం,పూర్ణ,పుష్కలమ్మల ఉత్సవ మూర్తులతో పట్టణ పురవీధుల గుండా శ్రీ అయ్యప్ప స్వామిదేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు పుష్పర్చనాలు, మంగళహారతి మహా పడిపూజ (మెట్ల)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇతర నాయకులు హాజరుకాగా..వారికి ఆలయ కమిటీ శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం మహా పూజకు హాజరైన వందలాది మంది భక్తులకు తీర్థము అన్న ప్రసాదాలు పంచిపెట్టారు. గత 40 రోజులుగా అయ్యప్ప స్వాములకు పూజలు,భోజనం బిక్ష, మహా పూజకు పూజ సామాగ్రిని అందించిన భక్తులకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బరాస.బిజెపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు మక్తల్ పట్టణ వాసులు (మహిళలు ) పెద్ద ఎత్తున పాల్గొన్నారు.