ఎయిడ్స్‌ నియంత్రణలో సాగర్ ఏరియా ఆసుపత్రికి ఉత్తమ అవార్డు

by Mahesh |
ఎయిడ్స్‌ నియంత్రణలో సాగర్ ఏరియా ఆసుపత్రికి ఉత్తమ అవార్డు
X

దిశ, నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని కమల నెహ్రు ఏరియా ఆసుపత్రికి ఎయిడ్స్‌, హెచ్‌ఐవీ నియంత్రణ,వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో ఉత్తమ అవార్డు లభించింది. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవ సందర్భంగా..నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, DPM సుధాకర్ చేతుల మీదుగా జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ICTC కౌన్సిలర్ మాలోత్ మంచు నాయక్ ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఉత్తమ అవార్డు రావడం తో పాటు..తానే అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని మాలోత్ మంచు నాయక్ ‌ తెలిపారు. ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు.

ఉత్తమ సేవలందించడానికి కృషి చేస్తామన్నారు. ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మాలోత్ మంచు నాయక్ పిలుపునిచ్చారు. వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష ప్రదర్శించకూడదని, వారిని మనలో ఒకరిగా చూడాలని చెప్పారు. చికిత్స కంటే నివారణే ఎయిడ్స్‌కు ఏకైక మార్గమని..ఈ వ్యాధిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. హెచ్‌ఐవీ బాధితుల ఆరోగ్యం కాపాడటం, కొత్తవారు వ్యాధి బారిన పడకుండా చూడటం మన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed