జల దిగ్బంధంలో అర్వపల్లి కేజీబీవీ..

by Sumithra |
జల దిగ్బంధంలో అర్వపల్లి కేజీబీవీ..
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం) : గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జల దిగ్బంధమైంది. ఆ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సుమారు 200 వందల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది బయట అడుగు వేసే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. డీఈఓ అశోక్ ఆదేశాల మేరకు విద్యార్థినులను ఇంటికి పంపించి, నీళ్లు తగ్గే వరకు తాత్కాలికంగా కేజీబీవీని సమీపంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో సర్దుబాటు చేస్తున్నట్లు ఎస్ఓ నాగరాణి తెలిపారు.

కుంటలోని నీళ్లు బయటకు వెళ్లే ఏర్పాటు చేయాలి : ఎస్ఓ నాగరాణి

కేజీబీవీ పాఠశాలను నీటి కుంటలో నిర్మించడం వల్ల భారీ వర్షాలు పడగానే కుంట నిండుతుందంటున్నారు ఎస్ఓ నాగరాణి. కుంటలోని నీరు బయటకు వెళ్లే మార్గం లేక పాఠశాలలోకి నీరు చేరుతుందని, కుంటలోని నీరు బయటకు వెళ్లే ఏర్పాటు చేయాలి వారు అధికారులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed