- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'కేసీఆర్ ఎన్నో దొంగ హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు'
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన సభను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని వలిగొండలోని తన స్వగృహంలో అరెస్ట్ చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ కు ముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ మంజూరు చేయలేదని అన్నారు. పిల్లయిపల్లి, భునదిగాని కాల్వల పనులు పూర్తి చేస్తామని చెయ్యలేదని, ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ ఎన్నో దొంగ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు లేక సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులకు గురువ్వుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన తరువాతనే కేసీఆర్ జిల్లా పర్యటన చెయ్యాలని అన్నారు.