పెళ్లి చూపులకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by Mahesh |
పెళ్లి చూపులకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

దిశ, కోదాడ/మునగాల: మునగాల మండలం నేలమర్రికి చెందిన రాంపంగు సురేష్ పెళ్లి చూపులకు తన ద్విచక్ర వాహనంపై ఆదివారం ఉదయం ముస్తాబై సూర్యాపేట‌కు బయలు దేరారు.కాగా జాతీయ రహదారిపై పై మాధవరం వద్ద సూర్యాపేట నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుతారి పని చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed