మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దే : ఎమ్మేల్యే పైళ్ల

by Sumithra |
మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దే : ఎమ్మేల్యే పైళ్ల
X

దిశ, భూదాన్ పోచంపల్లి : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఆపే శక్తి ఏ పార్టీకి లేదనీ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే గులాబీ జెండా హ్యాట్రిక్ విజయ ఢంకా మోగిస్తుందని ఎమ్మేల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ పాటి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి చిలువవేరు బాల నరసింహా సమన్వయంతో శనివారం జూలూరులో 11గ్రామాల పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం హట్టహాసంగ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి గజ్వేల్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజయ్యారు.

సమావేశాన్ని ఉద్దేశించి సభాధ్యక్షులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ప్రతీ విలేజ్ కు, ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రతి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం ప్రతీ ఒక్కరూ సమన్వయం చేస్తూ కలసికట్టుగా పనిచేయాలని అన్నారు. గెలుపు కోసం యుద్ధం చేయాలని పిలుపు నిస్తూ గ్రామ శాఖ, మండల శాఖా కలసి పనిచేసి ఎమ్మెల్యేను 50వేల మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. అనంతరం ముఖ్యఅతిథులు మాట్లాడుతూ నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదంతో వచ్చిన ఉద్యమ కెరటం కేసీఆర్ చలవ వల్లనే 56 లక్షల ఎకరాలు సాగు జరుగుతుందంటే ప్రజలు తమ ఓటుతో ఆయన ఋణం తీర్చు కావాలని అన్నారు.

జిల్లాకో మెడికల్ కాలేజ్ కేసీఆర్ లక్ష్యం అని చెప్పారు. కుల మత వర్గాలకు తావు లేకుండా 99 శాతం పనులు పూర్తి అయ్యాయని సంతోష పడటం కాదు మిగిలిన పనులు పూర్తి చేసి ఎవ్వరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదనీ వారు అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడు జరగని అభివృద్ధి కేవలం తెలంగాణా వచ్చిన తర్వాతనే సాధ్యమైందనీ తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మేల్యే అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు గ్రామశాఖల అధ్యక్షుల ద్వారా ప్రతి సమస్యను, అభివృద్ధిని అడిగి తెలుసుకుని ప్రతీ ఒక్కకార్యకర్త సైనికుడిగా అందరినీ సమన్వయం చేస్తూ గెలుపు కోసం కృషి చేయాలని, సెకండ్ క్యాడర్ శ్రేణులతో ఆప్యాయతను పంచుకొని భాగస్వామ్యం చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రతి కార్యకర్త గ్రామ అభివృద్ది కోసం అడిగిన కోరికను తీర్చే బాధ్యత నాదే అని పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని, గెలుపు ధీమాను ఇచ్చారు. బాటసింగారం నుండి దేశ్ ముఖీ- పిల్లాయి పల్లి డబుల్ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టరు నిర్లక్ష్యం విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఇంద్రియాల బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కాకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే బీఆర్ఎస్ గెలుపునకు సంకేతమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పీఎసీఎస్ చైర్మన్లు కందాడి భూపాల్ రెడ్డి, అందెల లింగం యాదవ్, ఆత్మ చైర్మన్ కందాల సుధాకర్ రెడ్డి, బంధారపు లక్ష్మణ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సామ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గోరంటి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల మహిపాల్ రెడ్డి, ఆర్ల లింగ స్వామి కుంటోల్ల మహేష్ గౌడ్, పగిళ్ల సుధాకర్ రెడ్డి, సర్పంచులు యాకరి రేణుక నర్సింగరావు, దుర్గం స్వప్న నరేష్, మన్నె పద్మా రెడ్డి, అందెల హరీష్యాదవ్, రమావత్ రాజు, దొడ్డి అలివేలు, నోముల ఎల్లారెడ్డి, మట్ట బాలమణి సుదర్శన్, ఎంపీటీసీలు శంకరమ్మ కిష్టయ్య, బందారపు సుమలత లక్ష్మణ్ గౌడ్, మొగిలి పాక యాదగిరి, నాయకులు నోముల మాధవరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి యాదగిరి, శేఖర్, మహేష్, పకీర్ సుధాకర్ రెడ్డి, రాగిరు సత్యనారాయణ, బాల్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story