- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కార్యకర్తలను పట్టించుకోవడం లేదని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
దిశ, మిర్యాలగూడ: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన భగవాన్ గత పది సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి ప్రాధాన్యత ఇవ్వడం, తనకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని మనస్థాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించినట్లు బంధువులు తెలిపారు. బాధితునికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.