CM రేవంత్ జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. ఫస్ట్ ఆ జిల్లా నుండే..!

by Satheesh |   ( Updated:2024-07-07 10:45:06.0  )
CM రేవంత్ జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్.. ఫస్ట్ ఆ జిల్లా నుండే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు మూహూర్తం ఫిక్స్ అయ్యింది. సొంత జిల్లా మహబూబ్‌నగర్ నుండి రేవంత్ జిల్లాల టూర్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా టూర్ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ అభివృద్ధిపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. కాగా, ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా వివిధ శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖల సెక్రటరీలతో భేటీ అయిన సీఎం రేవంత్.. త్వరలోనే జిల్లాల పర్యటన చేపడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఇకపై తాను కూడా ఫీల్డ్‌లోకి దిగుతానని స్పష్టం చేసిన రేవంత్.. ఈ మేరకు జిల్లాల పర్యటనకు సిద్ధం అయ్యారు. సీఎం జిల్లాల టూర్ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed