- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Mrs South India -2024: తగ్గేదేలే.. మిసెస్ సౌత్ ఇండియాగా హైదరాబాద్ యువతి
X
దిశ, వెబ్‌డెస్క్: మిసెస్ సౌత్ ఇండియా- 2024 కిరీటం హైదరాబాద్‌కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన మిసెస్ సౌత్ ఇండియా పోటీల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 మంది ఫైనల్స్‌కు ఎంపిక కాగా వర్షారెడ్డి టైటిల్ విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. "తెలంగాణ నుంచి వెళ్లి టైటిల్ సాధించడం సంతోషంగా ఉంది. మిస్ సౌత్ ఇండియా-2012 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నేను మిస్ కన్జెనియాలిటీ టైటిల్‌ను సంపాదించాను" అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, వర్షారెడ్డి హైదరాబాద్‌లోని పలు ఐటీ కన్సల్టింగ్, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, సినిమా ప్రొడక్షన్ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.
Advertisement
Next Story