నరరూప రాక్షసుడు తెలంగాణకు వస్తుంటే రక్తం మరుగుతోంది: MP లక్ష్మణ్ ఫైర్

by Satheesh |   ( Updated:2023-04-28 13:02:49.0  )
నరరూప రాక్షసుడు తెలంగాణకు వస్తుంటే రక్తం మరుగుతోంది: MP లక్ష్మణ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిహార్ కేడర్‌కు చెందిన పాలమూరు బిడ్డ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఆనంద్ మోహన్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తప్పుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన తెలంగాణలో అడుగు పెట్టడానికి వీల్లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ ఎంట్రీ అయితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బిహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆటవిక పాలనను అమలుచేస్తున్నారని, ఆయన ఆలోచనలు, కేసీఆర్ తీరు ఒకేలా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ఇప్పటివరకు ఆనంద్ మోహన్ విడుదలపై సీఎం కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయలేదని, ఆయన మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

నితీష్ కుమార్ ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలోని కృష్ణయ్య కుటుంబ సభ్యులను కలవడానికి ఆనంద్ మోహన్ వస్తుంటే కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు. నితీష్-కేసీఆర్ హత్యా రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రాళ్ళతో కొట్టించి తెలంగాణ అధికారి కృష్ణయ్యను చంపించిన నరరూప రాక్షసుడు తెలంగాణకు వస్తూ ఉంటే ప్రజల రక్తం మరిగిపోతుందని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో అడుగు పెటటడానికి వీల్లేదని, ఒకవేళ వస్తే కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు అడ్డుకుని తీరుతాయని స్పష్టం చేశారు.

Also Read..

Google లో వీటి గురించి సెర్చ్ చేస్తే జైలుకు పోవడం ఖాయం..

బీఆర్ఎస్‌తో పొత్తు అయినా పోరాటం.. తమ్మినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్


Advertisement

Next Story