యాంటీ ముస్లిం, యాంటీ బీసీ బిల్లు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
యాంటీ ముస్లిం, యాంటీ బీసీ బిల్లు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తో్న్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం పార్లమెంట్ స్పెషల్ సెషన్స్‌లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లులో బీసీలకు న్యాయమైన వాటా దక్కలేదన్నారు. ధనవంతులు మాత్రమే ఈ చట్టసభల్లో ఉండేలా బిల్లు పెట్టారని ఆరోపించారు.

ఈ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో రాజ్యాంగ సభలో నెహ్రూ, సర్ధార్ వల్లభాభాయ్ పటేల్ ముస్లింలపై వివక్ష చూపించారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ రోజు వారు నిజాయతీగా ఉంటే.. ముస్లింలకు మరింత ప్రాధాన్యత దక్కేదన్నారు. కాగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో మంగళవారం ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story