‘ఆన్సర్ చెప్పండి’.. బీఆర్ఎస్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రశ్న

by Satheesh |   ( Updated:2024-07-16 10:35:03.0  )
‘ఆన్సర్ చెప్పండి’.. బీఆర్ఎస్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, బీజేపీ విలీనంపై తెలంగాణ పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేయబోతున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు పార్టీలను ఇరుకున పెడుతున్నారు. అవినీతి కేసుల నుండి తప్పించుకోవడంతో పాటు పార్టీని కాపాడుకోవటం, లిక్కర్ కేసులో కూతురు కవితకు బెయిల్ కోసం కేసీఆర్‌కు మరోదారి లేదని.. అందుకే గులాబీ పార్టీని కమలం పువ్వు పార్టీలో కలపబోతున్నారని.. ఇందులో భాగంగానే ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపిస్తున్నారు. విలీనంపై ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారని.. త్వరలోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ కాబోతుందంటూ విమర్శల ఎటాక్ చేస్తున్నారు. విలీనంలో భాగంగా మొదటగా బీఆర్ఎస్ నలుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరుతారని కాంగ్రెస్ లీడర్ సామల రామ్మోహన్ ఏకంగా ట్వీట్ చేశారు.

ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తున్నారా..? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్‌ను ఒవైసీ డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు గులాబీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆ పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటుంది. ఈ క్రమంలోనే బీజేపీ విలీనంపై ఆన్సర్ చెప్పాలని నేరుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించడంతో.. కారు, కైట్ పార్టీలకు మధ్య ఫ్రెండ్ షిప్ బ్రేక్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. విలీనం వార్తలపై ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్న గులాబీ లీడర్స్ ఓవైసీ వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.

Advertisement

Next Story