కవిత, రేవంత్ బిజినెస్ పార్ట్‌నర్స్.. అందుకే ఆమె కాంగ్రెస్‌లోకి: MP అర్వింద్

by Satheesh |   ( Updated:2023-10-17 16:54:00.0  )
కవిత, రేవంత్ బిజినెస్ పార్ట్‌నర్స్.. అందుకే ఆమె కాంగ్రెస్‌లోకి: MP అర్వింద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. మున్నూరు కాపులు, మెనార్టీలు ఆకుల లలితను నమ్మొద్దని సూచించారు. గతంలో డీఎస్‌ను మోసం ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆకుల లలిత.. ఇప్పుడు డీఎస్ కొడుకు ధర్మపురి సంజయ్‌ను మోసం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్స్ అని అర్వింద్ ఆరోపించారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఆకుల లలితను.. ఎమ్మెల్సీ కవితనే కాంగ్రెస్‌లోకి పంపించి టికెట్ ఇప్పిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీని నష్టపరిచేందుకు కవిత, రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story