లాభాలను దోస్తులకు.. నష్టాలను జాతికి అంకితం చేయడమే మోడీ విధానం : KTR

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-11 07:27:52.0  )
లాభాలను దోస్తులకు.. నష్టాలను జాతికి అంకితం చేయడమే మోడీ విధానం : KTR
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బైలాదిల్లా నుంచి బయ్యారానికి పైపులైన్ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ బైలదిల్లా ఐరన్ ఓర్ కంపెనీ పెట్టిందన్నారు. బైలాదిల్లా అనేది 1.34 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభించే గని అన్నారు. విశాఖ ఉక్కుకు, బయ్యారం గనులకు ఒక సంబంధం ఉందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే యువతకు ఉద్యోగాలు లేకుండా పోతాయన్నారు. ఎల్‌ఐసీ ద్వారానే రైతు బీమాలు చేసిన పాలకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ సంస్థలు బతికుంటేనే జాతికి మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి కేసీఆర్ అన్నారు.

నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను దోస్తులకు అంకితం చేయడం మోడీ విధానం అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఉందన్నారు. రెండు తెలుగు స్టేట్స్ లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం చెప్పిందన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రధానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. బైలాదిల్లా నుంచి బయ్యారానికి 50 శాతం పైపు లైన్ ఖర్చు భరిస్తామని చెప్పామన్నారు.

Advertisement

Next Story

Most Viewed