BREAKING: సీఎం రేవంత్ ఓటుకు నోటు కేసుపై మోడీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
BREAKING: సీఎం రేవంత్ ఓటుకు నోటు కేసుపై మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ ఓటుకు నోటు కేసుపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెలంగాణలో పర్యటిస్తోన్న మోడీ.. సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో పెద్ద స్కామ్ చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఫైర్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తొక్కి పెట్టింది.. ఇప్పుడు కాళేశ్వరం స్కామ్‌ను కాంగ్రెస్ తొక్కి పెడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని.. అవినీతిలో ఆ రెండు పార్టీలు భాగస్వాములే అని విమర్శించారు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేతలతో పాటు.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష నేతలున్నారని అన్నారు. వంద రోజుల్లో రుణమాఫీ అని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ అని బోగస్ మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల ఎన్డీఏ చేసిన అభివృద్ధిని మీరంతా చూశారని.. కానీ కాంగ్రెస్ మళ్లీ పాత రోజుల్ని తీసుకురావాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఓ పక్కా ప్రపంచం పురోగమిస్తుంటే.. కాంగ్రెస్ చేతిలో దేశం అవినీతిమయైందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దేశాన్ని అవినీతి ఊబిలోకి నెట్టిందని ఫైర్ అయ్యారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ ఓటుకు నోటు కేసుపై ప్రధాని మోడీ మాట్లాడటం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed