- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజ్వల్‌ను దేశం దాటించి.. నన్ను అరెస్ట్ చేయడం దారుణం: MLC కవిత సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ అనంతరం మంగళవారం కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించారు.. నా లాంటి వారిని అరెస్ట్ చేశారు.. ఇదెక్కడి దారుణం అన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని అని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. సీబీఐ, ఈడీ అరెస్టు అనంతరం ఆమెకు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో జ్యుడిషియల్ రిమాండ్ అనివార్యమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ తరఫు న్యాయవాది స్పెషల్ జడ్జి కావేరి బవేజాను రిక్వెస్టు చేశారు. వారం రోజుల్లో ఆమెపై చార్చిషీట్‌ను దాఖలు చేయనున్నట్లు స్పెషల్ జడ్జికి వివరించారు. హైదరాబాద్‌లో మార్చి 15న అమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో చార్షిషీట్‌ను దాఖలు చేయాల్సి ఉన్నది. ఆ ప్రకారం ఈ నెల 15 లోగా చార్షిషీట్‌ను కోర్టుకు సమర్పించాల్సి ఉన్నది. ఈ కారణంగా ఆమె రిమాండ్‌ను స్పెషల్ జడ్జి మే 14 వరకు పొడిగించారు.
Read More...
నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!