‘ఓ మహిళగా బాధపడుతున్నా’’.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్‌కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

by Satheesh |   ( Updated:2023-12-15 09:25:36.0  )
‘ఓ మహిళగా బాధపడుతున్నా’’.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కామెంట్స్‌కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఋతుస్రావం అనేది వైకల్యం కాదని, అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని, అందుకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వడం అవసరం లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు ఇవ్వాల్సింది పోయి.. మంత్రి ఆ విషయాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించిందన్నారు. నెలసరి తమకున్న ఎంపిక కాదని, అదొక సహజమైన జీవ ప్రక్రియ అని తెలిపారు. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం మహిళల బాధను విస్మరించినట్లేనని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed