క్వాలిటీ లేకనే సుంకిశాల ప్రమాదం : ఎంఎల్ఏ వివేక్

by M.Rajitha |
క్వాలిటీ లేకనే సుంకిశాల ప్రమాదం : ఎంఎల్ఏ వివేక్
X

దిశ, వెబ్ డెస్క్ : సరైన క్వాలిటీ లేకనే సుంకిశాల ప్రాజెక్ట్ రిటైనింగ్ వాల్ కూలిందని చెన్నూరు ఎంఎల్ఏ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎస్పీ క్యాంప్ లో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి వివేక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. సుంకిశాల ప్రాజెక్టును గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించిందన్నారు. అపుడు మేము మేఘా కంపెనీ నాసిరకం పనులు చేస్తూన్నారని, వెంటనే ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కేసీఆర్ కు సూచిస్తే పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. ముందు నుండి ఆ కంపెనీ నాసిరకం పనులు చేస్తుండటం వలనే, క్వాలిటీ లేక రిటైనింగ్ వాల్ కూలిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఇప్పుడు కూడా ప్రజలకు అబద్దాలు చెబుతూ.. వారిని తప్పుదారి పత్తిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాం. రూ.2 లక్షల రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు కాబట్టే ఓర్వలేక మాపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు.

Next Story

Most Viewed