Disha Effect : ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

by Kalyani |
Disha Effect : ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, ఖమ్మం : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు ను ఆదేశించారు. దిశ దినపత్రికలో గత రెండు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి పై కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ఆస్పత్రి పనితీరు పై సోమవారం ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్నారు. డాక్టర్లు ఎంత మంది ఉన్నారు, ఏ రోస్టర్ ప్రకారం గా అందుబాటులో ఉంటున్నారని అనే విషయం పై కలెక్టర్ కు వివరించారు. ఆసుపత్రిలో ప్రతి రోజూ శానిటేషన్ వ్యవస్థ పై తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Next Story

Most Viewed