కాళేశ్వరంను ఏటీఎంగా చేసుకుని దోచుకున్నరు: ఎమ్మెల్యే విజయరమణారావు ఫైర్

by Satheesh |   ( Updated:2024-02-17 15:05:32.0  )
కాళేశ్వరంను ఏటీఎంగా చేసుకుని దోచుకున్నరు: ఎమ్మెల్యే విజయరమణారావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంను ఏటీఎంగా చేసుకొని గత ప్రభుత్వ పాలకులు దోచుకున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మండిపడ్డారు. ఇరిగేషన్ శ్వేతపత్రంపై జరిగిన చర్చలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కొట్లాడే దమ్ముంది.. ఏదైనా చేస్తామన్నారు. లక్ష ఎకరాలకు కాళేశ్వరంతో నీరిస్తామని ఇవ్వలేదని, అన్నారం లీకేజీ అవుతోందని, సుందిళ్లకు కూడా నష్టం జరుగుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ను నాశనం చేశారని మండిపడ్డారు. నాతో రండి చూపిస్తానని.. చివరి ఆయుకట్టుకు నీరివ్వలేదన్నారు. రైతుల పొట్టగొట్టారన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు. కేసీఆర్‌కు మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. మీకు నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. ఒకటి మాట్లాడితే నాలుగు మాట్లాడుతామన్నారు. ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వబోమన్నారు.

Advertisement

Next Story

Most Viewed