- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘విషయం తెలియకుండా సీఎం ఏదేదో మాట్లాడుతున్నారు’
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేలమైన మాకు సాక్షాత్తు అసెంబ్లీలో అవమానం జరగడం బాధాకరం అన్నారు. నాలుగున్నర గంటలు సభలో తాము నిల్చున్నా పాలకపక్షం స్పందించపోగా.. హేళన చేసిందని ఆవేదన చెందారు. ముఖ్యంగా జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయని అన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు దిగజారాయని తెలిపారు.
‘నా గెలుపు కోసం ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల నా మీదనే మూడు కేసులు నమోదు అయ్యాయి. సీఎం రేవంత్ సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా మా మీద సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడారు. మాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. దళితుల ఓట్లతోనే తాము గెలిచాం. ఎవరు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము వ్యతిరేకం అన్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారు. స్పీకర్ రేపైనా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి’ అని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.