MLA రాజయ్య వేధింపుల కేసు : నేడు పోలీసుల విచారణకు సర్పంచ్ నవ్య

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-28 05:18:45.0  )
MLA రాజయ్య వేధింపుల కేసు : నేడు పోలీసుల విచారణకు సర్పంచ్ నవ్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య లైంగిక వేధింపుల కేసులో జానకీపురం సర్పంచ్ నవ్య నేడు పోలీసులు విచారణకు హాజరు కానున్నారు. రాజయ్య లైంగిక వేధింపులపై గతంలో నవ్య ఫిర్యాదు చేశారు. అయితే వేధింపులపై ఆధారాలు సమర్పించాలని ఇటీవల సర్పంచ్ నవ్యకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయమ తెలిసిందే.

వేధింపులపై సర్పంచ్ నవ్య, భర్త ప్రవీణ్‌లు ఇప్పటి వరకు ఆధారాలు సమర్పించలేదు. కాగా నేడు నవ్యను పోలీసులు విచారించనున్నారు. ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నవ్యకు పోలీసులు సూచించారు. మరో వైపు మహిళా కమిషన్ నుంచి నవ్యకు ఆధారాలు సమర్పించాలని నోటీసులు అందాయి. రాజయ్య వేధింపులపై సాక్ష్యాధారాలు సమర్పించాలని కమిషన్ నవ్యను కోరింది. పోలీసు విచారణ కారణంగా ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story