‘నువ్వు మొగోడివేతే రాజీనామా చేయ్’.. దానంకు MLA కౌశిక్ రెడ్డి సవాల్

by Anjali |
‘నువ్వు మొగోడివేతే రాజీనామా చేయ్’.. దానంకు MLA కౌశిక్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘దానం నాగేందర్ నేను చెప్పిన మాటలు కాదివి.. మీ ముఖ్యమంత్రైన రేవంత్ రెడ్డి నిన్ను ఏమని తిట్టినరో నువ్వు ఒకసారి చూసుకున్నావా? అసలు నీకు సిగ్గు, శరం ఏమైనా ఉన్నాయా? అన్నారు. పంజాగుట్ట చౌరస్తాలో దానం నాగేందర్ బీడీలు అమ్ముకునే వాడని రేవంత్ రెడ్డే చెప్పాడు. బీడీలు అమ్ముకునే నువ్వు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించావు. ఇవాళ హైదరాబాదులో నీకన్న ఎక్కువగా హరాస్మెంట్ చేసేటోడు ఎవడైన ఉన్నడా? ఇవాళ బిడ్డ నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధితులు చాలా మంది నాకు అప్రోచ్ అయ్యారు. నీ సంగతి నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు, నువ్వు ఇప్పుడు కట్టే ఇల్లు పక్కన ల్యాండ్.. వాళ్లని ఎంత ఇబ్బంది పెట్టినవో నీ అక్రమాలు త్వరలోనే బయట పెడుతాం. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్మును కచ్చితంగా బయటకు తీస్తాం. నీకు నిజంగా అంత రోషం ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ భిక్ష పెట్టిన నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయ్ నీకు అంత దమ్ముంటే. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగోడివే అయితే రాజీనామా చేయు. దానం నాగేందర్ తో పాటు తొమ్మిది మంది పార్టీ వదిలిపెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయండి. మీ సంగతెందో అప్పుడు ప్రజలు చెప్తరు’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed