CM రేవంత్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రాళ్లతో కొడతారు: విప్ బీర్ల ఐలయ్య

by Satheesh |
CM రేవంత్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రాళ్లతో కొడతారు: విప్ బీర్ల ఐలయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉన్నదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. పదేళ్లు వ్యవస్థలను నాశనం చేసిన బీఆర్ఎస్, ఇప్పుడు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. శనివారం అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్‌ను మాజీ సీఎం కేసీఆర్ అనేక విధాలుగా అవమానించారన్నారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటన్నారు.

తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్పడం హస్యాస్పదంగా ఉన్నదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసింది మీరు కాదా..? అని మండిపడ్డారు. పదేళ్లు నియంతృత్వ పాలన చేసి, ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ ముందు కేటీఆర్ గొంతు చించుకుంటున్నారని, పదేళ్ల పాటు ఆయన గొంతు ఎందుకు మూగబోయిందని విమర్శించారు. పదేళ్లు విర్రవీగినట్లు, ఇప్పుడు వ్యవహరిస్తే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. సీఎంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed