ఐశ్వర్యరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు

by GSrikanth |
ఐశ్వర్యరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా డల్లాస్ కాల్పుల ఘటనలో తెలుగు యువతి ఐశ్వర్య రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్యరెడ్డి మృతిపై మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్యరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఐశ్వర్య కుటుంబానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరుపున అమెరికాలోని భారత కాన్సులెట్ అధికారులతో ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులు మాట్లాడారు. ఐశ్వర్య రెడ్డి మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తరలించాలని కోరారు.

Advertisement

Next Story