- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఆగస్ట్ 15 నాటికి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ ప్రక్రియ కంప్లీట్ చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఒకే దఫాలో పంట రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతులకు సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు.
కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు ఇచ్చిన మేరకు రుణమాఫీకి కసరత్తు స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల చివరి నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్ట్ 15 నాటికి ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది.