Minister Thummala: పరవళ్లు తొక్కుతున్న గోదావరి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశం

by Gantepaka Srikanth |
Minister Thummala: పరవళ్లు తొక్కుతున్న గోదావరి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: గోదావరి వరదలపై సంబంధిత అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలో వరద రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాక్ వాటర్‌ను ఎప్పటికప్పుడు పంప్ చేయాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కాగా, ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. తగ్గినట్లే తగ్గి మరింతగా పెరిగి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకుంది. గడిచిన వారం రోజుల్లో మూడుసార్లు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయగా తాజాగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి ప్రవహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed