రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని త్వరగా గోడౌన్లకు చేర్చాలి.. మంత్రి తుమ్మల

by Rajesh |
రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని త్వరగా గోడౌన్లకు చేర్చాలి..  మంత్రి తుమ్మల
X

దిశ ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి త్వరగా గౌడాన్లకు చేర్చాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ .. రైతులనుండి సేకరించిన ధాన్యం ప్రతికూల పరిస్థితుల కారణంగా కురుస్తున్న వర్షానికి తడవకుండా ఉండేందుకు ధాన్యం నిలవచేసేందుకు మిల్లర్లకు అనుమతి ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. జిల్లాలలోని ఐకేపీ, పీఏసీఎస్‌తో పాటు కొనుగోలు కేంద్రాల నుండి నుండి రైతులు పూర్తి స్థాయిలో ప్రయోజనాలను పొందేలా, వ్యాపారులచే మోసపోకుండా నిరోధించడానికి, అన్ని పిసిలను తనిఖీ చేయడానికి జిల్లాలోని ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నామినేట్ చేసారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా అవసరమైన సహాయాన్ని అందిచాలన్నారు. అకాల వర్షాల కారణంగా వరి పంట దెబ్బతిన్న సందర్భాల్లో, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఇదివరకే రైతులకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ధాన్యము కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే ప్రతి ధాన్యం గింజను చివరి వరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పునరుద్ఘాటించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేసారు.

Advertisement

Next Story