రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య వైభవం చాటాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Vinod kumar |
రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య వైభవం చాటాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి సాహిత్య వైభవం చాటాలని తెలంగాణ భాషా-సాంస్కృతిక, సాహిత్య అకాడమీ అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉర్దూ, తెలుగు భాషలలో 33 జిల్లాల్లో రచనం, పద్యం, ఉర్దూ కవిత్వంలో కవి సమ్మేళనాలను రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వహించి ఎంపికైన ఉత్తమ కవితలకు బహుమతులు అందజేశాయాలన్నారు. కవులు, సాహితీ వేత్తలను సన్మానించి ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ కవితలను పుస్తక రూపంగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

నాడు-నేడు వ్యత్యాసాలను, అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో జరిగిన అభివృద్ధి, విద్యుత్, సాగునీటి, తాగునీటి, సాంస్కృతిక, పర్యాటకంగా, క్రీడలపరంగా జరిగిన అభివృద్ధిలపై కవులు, సాహితీ వేత్తలు రచనలను కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story