- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana Assembly: సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి.. అసెంబ్లీ స్పీకర్ ఆదేశం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆదివారం ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu)తో పాటు గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), శాసనసభ సెక్రటరీ వి.నరసింహా చార్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు, రాష్ట్ర డీజీపీ మరియు పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సభాపతి ప్రసాద్ కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.