‘గత పదేళ్లలో విద్యా వ్యవస్థకు తీరని నష్టం’..మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-05 13:56:24.0  )
‘గత పదేళ్లలో విద్యా వ్యవస్థకు తీరని నష్టం’..మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:గత పదేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థకు తీరని నష్టం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నేడు(సెప్టెంబర్ 5)ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం(Teacher's Day)లో మంత్రి పొన్నం మాట్లాడుతూ గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. గత బీఆర్‌ఎస్(BRS) హాయంలో విద్యా వ్యవస్థ(Education System) దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం(కాంగ్రెస్) చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఎటువంటి కోర్టు సమస్యలు లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు(Integrated Model Schools) కట్టిస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ స్కూళ్ల(Government School)లో విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed