- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. ఇద్దరు కీలక నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ
దిశ, రాజేంద్రనగర్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులే హస్తం గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరుబోతున్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. దీనికి కారణం ఇవాళ ఉదయం ఎమ్మెల్యే ఇంటికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావడమే. మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్వామి గౌడ్ ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో మైలార్‌దేవుపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన వెంట ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో దాదాపు గంట సేపు వీరి భేటీ జరిగిందని సమాచారం. ప్రకాశ్‌గౌడ్, స్వామి గౌడ్‌లను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మంత్రి కోరినట్లు తెలుస్తున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ కావడం తెలంగాణలో చర్చకు దారితీసింది. వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లేందుకు ఆయన సమావేశమైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఈ తాజా పరిణామాలు త్వరలోనే రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం.
త్వరలో మినిస్టర్ క్వార్టర్స్‌లో భేటీ
మంత్రులందరూ త్వరలోనే మినిస్టర్ క్వార్టర్స్‌కు షిఫ్ట్ అవుతున్నారని, తర్వాత వివిధ కుల సంఘాల నేతలతో సమావేశమై వారి అభిప్రాయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. అన్ని దేవాలయాల్లో ఆయా సంఘాల భవనాలు ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ నేతలతో సమావేశం మర్యాదపూర్వక భేటీ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు. రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పడం గమనార్హం.