ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశం ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేశారు : మంత్రి పొన్నం

by Kalyani |   ( Updated:2024-12-23 14:31:36.0  )
ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశం ప్రపంచంతో పోటీ పడేలా కృషి చేశారు : మంత్రి పొన్నం
X

దిశ, ఖైరతాబాద్ : యువత పీవీ చూపిన మార్గదర్శకాన్ని స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీవీ జ్ఞానభూమి, పీవీ మార్గ్ లో పూర్వ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సంస్కరణ సభ సందర్భంగా పీవీ ఘాట్ వద్ద ప్రభుత్వ సలహాదారు, కే.కేశవరావు తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భారతరత్న పీవీ నరసింహారావు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. పీవీ నరసింహారావు ఘాట్ ప్రాంగణంలో ఐ క్యాంప్ ను ప్రారంభించి కళ్లద్దాలు అందజేశారు.

అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ముద్దు బిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కి సంబంధించిన బిడ్డ, వారు అంత అత్యున్నత స్థానానికి ఎదగడం మన అందరికీ గర్వ కారణమని అన్నారు. బహుభాషా కోవిదుడు గా, అపార జ్ఞానం తో,అపార చాణక్యుడిగా రాజకీయ పదవులే తన వద్దకు వచ్చే విధంగా మౌనంగా ఉంటూనే ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశమునకు మారుమూల ప్రాంతం నుంచి భారత ప్రధాని కావడం మన అందరికీ గర్వకారణమన్నారు.

ఈరోజు ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగి ఇతర దేశాలతో నిలబడేటట్లు ఆర్థిక సంస్కరణలు చేసిన ఘనుడు, విదేశాంగ విధానం, విద్యా వ్యవస్థ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు అనేకమైన సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావుకి ఘన నివాళులు అర్పిస్తూన్ననని తెలిపారు. యువత ఆర్థిక సంస్కరణల్లో ఆయన ను ఆదర్శంగా తీసుకుంటే విజయాలు సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వేణుగోపాల చారి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్ఎల్ సి వాణి దేవి, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, మాజీ బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ ప్రసాద్, పీవీ రాజేశ్వరరావు, అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి, సికింద్రాబాద్ ఆర్ డి ఓ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.


Read More..

ఆర్థిక విప్లవాన్ని సృష్టించి…దేశ ఆర్థిక ప్రగతికి నాంది పలికిన గొప్ప వ్యక్తి…

Advertisement

Next Story

Most Viewed