- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిరోడ్డు మీద Minister Malla Reddy డ్యాన్స్ (వీడియో)
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిన చందంగా టీఆర్ఎస్ తలపెట్టిన మునుగోడు ప్రజా నివేదన సభ ప్రజలకు, పేషెంట్లకు కష్టాలు తెచ్చిపెట్టింది. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తన కాన్వాయ్‌తో రోడ్డుమార్గం గుండా మునుగోడుకు బయలుదేరారు. అర్ధగంటకు ముందు నుంచే ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను ఉప్పల్, ఎల్బీనగర్ మార్గాల్లో ఆపివేయడంతో ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారు. కొన్నిచోట్ల అంబులెన్సులకు సైతం చిక్కులు ఎదురయ్యాయి. మంత్రి తలసాని ఆధ్వర్యంలో సుమారు నాలుగున్నర వేల కార్లు నగరం నుంచి మునుగోడుకు వెళ్తుండడంతో రోడ్లన్నీ గులాబీ కార్లతో నిండిపోయాయి. రోజువారీ ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యయి.
ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పోటాపోటీగా కార్లను రెడీ చేసి మునుగోడుకు బయలుదేరారు. మంత్రి మల్లారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్డుపై తాను వెళ్తున్న కారు మీదకెక్కి డ్యాన్స్ చేశారు. చుట్టూ వందలాది వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే డ్యాన్సులు చేయడం బాధ్యతారాహిత్యమేనని ప్రజలు మండిపడ్డారు. ఉప్పల్, ఎల్బీనగర్ రింగురోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఒకవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్, మరోవైపు గులాబీ నేతల వేలాద కార్లతో ర్యాలీ కారణంగా నగరంలోని అనేక సిటీరోడ్లు ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి నిలిచిపోయాయి.