సడన్‌గా ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కేటీఆర్

by GSrikanth |
సడన్‌గా ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా ఢిల్లీకి పయనం అయ్యారు. రేపు కవితను ఈడీ ప్రశ్నించనున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు కేసీఆర్ తన కూతుర్ని అరెస్ట్ చేస్తే చేయనీయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి విచారణ విషయమై ఇప్పటికే కవిత పార్టీ లీగల్ టీమ్‌తో చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు మరి కొంతమంది నేతలు కూడా ఢిల్లీకి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story