- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గవర్నర్ వ్యవస్థపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో గవర్నర్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలను మాట్లాడుతున్నారని, రాజ్ భవన్ ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని అన్నారు. రాజ్ భవన్ లో ప్రధాని ఫోటోలు పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఎన్నుకున్నారని గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని నిలదీశారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొవద్దని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీనే చెప్పారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో ఉన్న రాజ్ పత్ ను కర్తవ్య పత్ గా మార్చారు మరి గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్లు పెట్టిందని అలాంటి వ్యవస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థతో దేశానికి ఏం ఉపయోగమన్నారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్రం హామీలు ఇచ్చి విస్మరించిందని మండిపడ్డారు.
నియోజకవర్గాల విభజన చేస్తామని మర్చిపోయారని అన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెటే బీజేపీకి చివరి బడ్జెట్ అని విమర్శించారు. 2014 లో ప్రవేశపెట్టినది తూతూ మంత్రం బడ్జెట్ అయితే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇదే చివరి బడ్జెట్ అన్నారు. తెలంగాణకు రైల్వే లైన్ ఇవ్వలేదని కేటాయించినవి కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. 8 ఏళ్లలో రాష్ట్రంలో వేసిన రైల్వే లైన్ 100 కిలో మీటర్ల కంటే తక్కువే అని, మహారాష్ట్ర, గుజరాత్ లో కోచ్ ఫ్యాక్టరీలు పెట్టారు కానీ తెలంగాణకు మాత్రం మాట ఇచ్చి మర్చిపోయారన్నారు. లింగంపల్లి-విజయవాడ కొత్త రైలు ఇచ్చారని అంతకు మించి ఇంకేం ఇవ్వలేదన్నారు. నేను చెప్పింది తప్పని రుజువు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధమని సవాల్ చేశారు. ఈ బడ్జెట్ లో రైల్వే లైన్ల కు నిధులు కేటాయించేలా నలుగురు బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే ఉలుకు పలుకు లేదని అన్నారు. కేంద్రం సీనియర్ సిటిజన్ రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని మోడీకి సీనియర్ సిటిజన్ పాస్ ఉపయోగపడుతుందన్నారు. రైతుబంధు మాదిరిగానే పీఎం కిసాన్ కింద ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు రాబట్టుకునే విషయంలో బీఆర్ఎస్ ఎంపీ లతో బీజేపీ ఎంపీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.