- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ ప్రధాని.. వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ కేటీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. వరుస ట్వీట్ల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం విఫలం కావడానికి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం వరుస ట్వీట్లు చేసిన కేటీఆర్.. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగులను ఎన్నుకున్న ఫలితంగా తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలిపోయిందని ధ్వజమెత్తారు.
రూ. 20 వేల కోట్ల లోకోమోటివ్ కోచ్ గుజరాత్‌కు తలించారని మండిపడ్డారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం, పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటీఐఆర్ ప్రాజెక్టు గిరిజన యూనివర్సిటీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని ప్రధాని చెబుతున్నాడని.. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేనప్పుడు తెలంగాణ ప్రజల ప్రాధాన్యత క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణకు...
— KTR (@KTRBRS) March 30, 2023
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం - ప్రధాని
ప్రధాని…