Konda Surekha: ఆ ఎమ్మెల్యే ఓ పిచ్చోడు.. విదేశాల్లో యూట్యూబ్ చానెళ్లు: కొండా సురేఖ హాట్ కామెంట్స్

by Ramesh N |
Konda Surekha: ఆ ఎమ్మెల్యే ఓ పిచ్చోడు.. విదేశాల్లో యూట్యూబ్ చానెళ్లు: కొండా సురేఖ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (BRS Party) బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవకు దిగే విధంగా వ్యవహరించాడని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

విదేశాల నుంచి బీఆర్ఎస్ యూట్యూబ్ చానెళ్లు

కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిజంగా రాజీనామా చేశారని తెలిపారు. మంత్రి వెంకట్ రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు మాట్లాడారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే శిక్ష కచ్చితంగా పడుతుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని, కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కోరారు. అసెంబ్లీకి రాని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను ఎందుకు దాటించారని మంత్రి కొండా సురేఖ నిలదీశారు. యూట్యూబర్లను తెలంగాణ నుంచి నడిపించకుండా.. అమెరికా, బ్రిటన్ ల నుంచి ఎందుకు నడిపిస్తున్నారు..? అని ప్రశ్నించారు. మీరు చేసేది చట్టబద్దమైన పనే అయితే, ఇక్కడి నుండే చేయించ వచ్చు కదా? అని ప్రశ్నించారు.

Advertisement

Next Story