ప్రజల్లో మీడియా పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచిన అక్షర శిల్పి రామోజీ రావు: మంత్రి కోమటిరెడ్డి

by Anjali |   ( Updated:2024-06-08 08:48:12.0  )
ప్రజల్లో మీడియా పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచిన అక్షర శిల్పి రామోజీ రావు: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖమాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని ఆయన అన్నారు. ఈనాడు దినపత్రికతో ప్రజల్లో మీడియా పట్ల సానుకూల ధృక్పదాన్ని పెంచిన అక్షర శిల్పి. “తెలుగు - వెలుగు” తో అమ్మ భాషకు వన్నె తెచ్చేందుకు విశేష కృషి చేసిన భాషాభిమాని రామోజీ రావు అంటూ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు గారు ఏ రంగంలో ఉన్నా అత్యున్నత ప్రమాణాలు నిర్దేశించుకున్నారని.. విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదని వెల్లడించారు. ఈనాడు, ఈటీవీతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed