- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 యోగా డే కౌంట్ డౌన్ స్టార్ట్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా మహోత్సవ్ 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా శనివారం ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కాగా ఆయన శుక్రవారం కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా మహోత్సవాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో గతేడాది వైభవంగా యోగా డే నిర్వహించినట్లు గుర్తుచేశారు. ప్రజలందరినీ మరింత చైతన్యం చేయడం కోసం 100 రోజుల నుంచే కౌంట్ డౌన్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.
100 రోజుల కౌంట్ డౌన్‌ను ఢిల్లీలో, 75 రోజుల కౌంట్ డౌన్‌ను అస్సాంలో, 55 రోజుల కౌంట్ డౌన్‌ను రాజస్థాన్‌లోని జైపూర్ సిటీలో ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. కాగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 25 రోజుల కౌంట్ డౌన్‌ను శనివారం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. జూన్ 21న నిర్వహించే యోగా డేకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు ఇందులో పాల్గొంటారని ఆయన చెప్పారు.
సుమారు 1000 మంది కళాకారులు సైతం పాల్గొంటారన్నారు. యోగాతో సంబంధం ఉన్న108 సంస్థల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర గవర్నర్, సీఎం, ప్రభుత్వ పెద్దలకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. సినిమా ఆర్టిస్టులు, కళకారులకు సైతం ఆహ్వానించినట్లు వెల్లడించారు.