గవర్నర్ తమిళిసై తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

by Sathputhe Rajesh |
గవర్నర్ తమిళిసై తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ వ్యవస్థ గురించి కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గవర్నర్ ఎందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో తెలియదని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్‌భవన్ లోకి రాజకీయాలను చొప్పిస్తున్నారని, ప్రభుత్వం పంపిన ఫైళ్లను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆపేశారని పేర్కొన్నారు. గవర్నర్ మొదటి నుంచీ ఫైళ్లు ఆలస్యం చేశారని, ఆమెకు సమయం తక్కువగా ఉందేమోనని అనుకున్నామన్నారు. కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని అర్థమైందని, వ్యవస్థల మధ్య పంచాయతీ మంచిది కాదని సీఎం ఆలోచించారని తెలిపారు.

Advertisement

Next Story