రాష్ట్ర ప్రజలకు Minister Harish Rao కీలక సూచన

by GSrikanth |   ( Updated:2023-07-28 14:01:20.0  )
రాష్ట్ర ప్రజలకు Minister Harish Rao  కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అత్యవసర సేవల సిబ్బందికి శుక్రవారం ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో విపత్తు నిర్వహణ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, అరోగ్య సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న తీరు అభినందనీయం అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed