- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు కౌంటర్! తెలంగాణ అప్పులపై కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సిద్ధిపేటలో బుధవారం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనందుకే కేంద్రం రూ.25 వేల కోట్లు ఆపిందన్నారు. 12 రాష్ట్రాల్లో మీటర్లు పెడుతున్నారని కేంద్రం మంత్రి చెప్పారన్నారు. 69 లక్షల రైతుల ప్రయోజనమా? కేంద్రం ఇచ్చే రూ.25వేల కోట్లు ముఖ్యమా? అని ఆలోచించి సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం రైతు పక్షాన నిలబడ్డారన్నారు. కేంద్రం నిధులు రాకపోయినా పర్వాలేదని.. మోటర్లకు మీటర్లు పెట్టేందుకు నిరాకరించారని గుర్తు చేశారు.
దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే రైతు పక్షపాతి అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు సురక్షితంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలన్నారు. కేంద్రం నుంచి రూ.25 వేల కోట్ల నిధులు వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోటార్లకు మీటర్లు తప్పవన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ కారణం కాదా? అన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించి కార్మికులను ఆగం చేసింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. జీడీపీలో కేంద్రం అప్పులు 57 శాతం అని.. తెలంగాణ అప్పులు 28 శాతమే అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ కేంద్రంలోని బీజేపీ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.