Health Minister: ప్రతి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు

by Gantepaka Srikanth |
Health Minister: ప్రతి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ప్లాన్ చేశామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా(Minister Damodara Raja Narasimha) పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి(MNJ Cancer Hospital)ని ఆకస్మికంగా పరిశీలించారు. ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రిలోని పాథలాజీ ల్యాబ్స్, పెట్ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, మెమ్మో గ్రామ్, పేషంట్ కేర్ పార్ట్స్, బోన్ స్కాన్, అల్ట్రా సౌండ్ విభాగాలతో పాటు పాలియేటివ్ కేర్ యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్(Cancer) పేషెంట్లకు మనోధైర్యం అవసరమన్నారు. ముఖ్యమైన జిల్లాల్లో ఆరు రీజనల్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. క్యాన్సర్(Cancer) వ్యాధికి మోరల్ సపోర్టు ఇచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు అవసరమన్నారు.

నాన్ కమ్యునికేబుల్ డిసీజ్‌లు అన్నింటిలోకెల్లా క్యాన్సర్(Cancer) అత్యంత ప్రమాదకరమన్నారు. క్రమశిక్షణ లేని జీవన విధానం సహా అనేక కారణాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు. ఇండియాలో ఏటా 14 నుంచి 15 లక్షల కేసులు నమోదవుతుంటే, తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్(Cancer) ‌గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్ చేస్తే ఎర్లీ స్టేజ్‌లో రోగ నిర్ధారణ చేయొచ్చన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో స్క్రీనింగ్ చేసి ఉచితంగా చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో డయాబెటిక్ క్లినిక్‌లకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story