తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలసలు

by Naresh N |
తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలసలు
X

దిశ, నాగార్జునసాగర్: వర్షం జాడ లేక పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. గుక్కెడు తాగునీటి కోసం పల్లెలు అల్లాడిపోతున్నాయి. పశువుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మేత లేక, తాగేందుకు నీరు లేక విలవిలలాడుతున్నాయి. గొర్రెల మందలు.. మందలు.. రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటు చూసినా గుంపులు గుంపులు .. కృష్ణా నది పరీవాహక ప్రాంతం గొర్రెలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొర్రెలు భారీ సంఖ్యలో నది దాటి ఏపీలోని పలు ప్రాంతాల్లో మేత మేయడానికి వెళ్తున్నాయి. అయితే మేత కోసం మూగజీవాలను కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు పోక తప్పడం లేదు. జీవాల పెంపకం చేపట్టేవారు వాటిని ఒకే చోట మేపడం వీలుకాదు. మేత కోసం మందలను ఇతర ప్రాంతాలకు తోలుక పోతుంటారు. సాధారణంగా ఈ కాలంలో మేత దొరకక ప్రతిరోజు జీవాలను మేపుతూ వాటితో పాటు వందల కిలోమీటర్ల కొద్ది వలసలు వెళ్తుంటారు పెంపకందారులు. నాగార్జునసాగర్ ప్రాంతం సరిహద్దు నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళుతున్న కాపర్ల దారులు గొర్రెలకు మేత మేపేందుకు మందలతో కాపరులు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు దాటి ప్రయాణిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ఊరు కాని ఊరు వచ్చి గొర్రెలను మేపుతూ రాత్రింబవళ్ళూ వాటి వెంటే ఉంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి దేవరకొండ మీదగా నాగార్జునసాగర్ ప్రాంతాల్లోని పొలాలు, ఖాళీ స్థలాల్లో మేత కోసం గొర్రెల మందలను మేపుతూ మూడు నాలుగు నెలల పాటు సొంతూళ్లకు దూరంగా ఉండాలి అని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లా నుంచి వేలాది గొర్రెలు రాక శివారు ప్రాంతాల్లో రోడ్ల పక్కన, మైదాన ప్రాంతంలో, ఎక్కడ చూసినా గొర్ల మందలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులు తమ ముగజీవాలకు మేత కోసం వలస వస్తుంటారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని మండలాల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. గొర్రెల మందలో ఒకటి రెండు గుర్రాలు లేదా గాడిదలు ఉంటాయి. వాటిని గొర్రెల కాపరుల సామాన్లను మోసేందుకు ఉపయోగిస్తారు.

ఈ నాలుగు నెలల పాటు వారు అత్యంత ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇంటి ముఖం చూడరు. రోడ్ల పక్కన ఖాళీ స్థలాలే వారి నివాసాలు. ఎంత భారీ వర్షాలు కురిసినా తాత్కాలిక గుడారాలు లేదా చెట్ల కింద గొర్రెల కోసం ఏర్పాటు చేసిన పాకలలో మందల పక్కనే జీవనం సాగిస్తారు. రేషన్‌ బియ్యం కొను క్కొని వండుకు తింటారు. కాలువలు, చెరువుల్లో గొర్రెలు, మేకలకు నీరు తాపి వారు కూడా అవే నీటిని వంటకు, తాగేందుకు వాడతారు. ఇలా మూడు, నాలుగు నెలల గొర్ల మందలతో సంచార జీవనం సాగిస్తారు. ఇలా మందలతో వెళ్తున్న నాగర్ కర్నూల్ జిల్లా వనపర్తి జిల్లా ప్రాంతాల నుంచి గొర్రెల పెంపకందారులను ‘ దిశ డిజిటల్ పత్రిక పలకరించి వారి పరిస్థితి తెలుసుకుంది.

ఎక్కడ చూసినా కొండలు, గుట్టలే

గొర్రెల మేత కోసం వందల కిలోమీటర్ల వలస నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎక్కడ చూసినా కొండలు, గుట్టలే ఉండటంతో జీవాలకు మేత దొరకదు. సారవంతమైన భూముల్లో వర్షాకాలంలో వరి, ఇతర పంటలు సాగుచేస్తుంటారు. దీంతో జీవాలకు స్థానికంగా మేత దొరకక కాపరులు నగర శివారు ప్రాంతాలకు లేదా నల్గొండ, జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతంలోని మేత మేపుకుంటూ ఆంధ్ర ప్రాంతానికి మాచర్ల. దుర్గి కారంపొడి, నరసరావుపేటకు ప్రాంతానికి బయలుదేరి వెళుతుంటాం అని కాపుల దారులు దిశతో చెబుతున్నారు. ఇలా బయలుదేరి వెళుతున్నారు అక్కడ మేత దొరుకుతుంది. అప్పుడు సొంతూళ్లకు వెళ్తారు. ‘మేము రాను పది రోజులు.. పోను 10 రోజలు ప్రయాణం సాగిస్తాం.’ అని వలస కాపరులు తెలిపారు.

స్థానికులు వచ్చి బెదిరిస్తారు : కాపరులు

వలస వచ్చిన వారంటే అందరికీ అలుసే మేత కోసం వలస వచ్చిన తమను అందరూ బెదిరిస్తుంటారని కాపరులు వాపోయారు. ఖాళీ ప్లాట్లలో గొర్రెలను మేపితే స్థానికులు వచ్చి బెదిరిస్తారు. తాము ఏమీ అనకుండా ముందుకు సాగిపోతుంటామన్నారు. గడ్డి మీరు మేపక పోతే మా జీవాలకు ఎలా ? అని కొందరు దాడులకు దిగుతుంటారు. తాము ఏమీ అనలేమన్నారు. మరికొందరు వచ్చి గొర్రెలు కావాలని బెదిరిస్తుంటారు. అమ్మేటివి లేవని చెప్పినా వినరు. కొందరు పెంచుకోవడానికి గొర్రె పిల్లలు కావాలని అడుగుతుంటారు. లేవని చెబితే.. ఇన్ని గొర్రెలున్నాయి. ఎందుకు ఇవ్వరు ? అని తిడుతారు అని వలస వచ్చిన కాపరులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed