- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ బలోపేతానికి కృషి చేయండి: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
దిశ, కాప్రా: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కాప్రాలోని ఎర్ర లలిత గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకమని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజస్థానీ సమాజ్ కాప్రా సర్కిల్ సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్వర్ణ రాజు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రవికుమార్, సుధాకర్, ఎంకే బద్రుద్దీన్, గిల్బర్ట్, మచ్చ పాండుగౌడ్, నవీన్, బైరి భాస్కర్ గౌడ్, బాబురావు, చందు, మల్లేష్ వంశరాజ్, పెంట రెడ్డి సాయిరాం, సురేఖ, లక్ష్మీ, శ్రీదేవి, భాను తదితరులు పాల్గొన్నారు.