- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నారు : ఈటల
దిశ, మేడిపల్లి: కాంగ్రెస్ వాళ్లు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... గత ఎంపీ రేవంత్ రెడ్డిని ఐదేళ్ల క్రితం ప్రశ్నించే గొంతు అని ప్రజలు భావించి పార్టీ బలహీనంగా ఉన్నా ఓట్లు వేసి, గెలిపించారు, కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చూడడానికి కానీ, వారి సమస్యలు తెలుసుకోవడానికి గానీ ఆయన ఒక్కసారి కూడా రాలేదని, ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యి నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదు అని అన్నారు.
మరి కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్‌ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏ మాత్రం లాభం లేదని, తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు, ఐటీ అభివృద్ధి, రోడ్లు, కార్యాలయాలు రావాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యం అన్నారు, తను నేరుగా ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఈ ప్రాంతంలోని సమస్యల పై నేరుగా చర్చించగలనన్నారు. మీరందరూ విజ్ఞులు, బాగా ఆలోచించి మీ ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు,ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, అమరేంద్ర రెడ్డి, కప్పరా ప్రసాద్, సుదర్శన్ రెడ్డి, గొనె శ్రీనివాస్, మహేష్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.