- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా..
దిశ, శామీర్ పేట: అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజులు అన్నారు. శామీర్ పేట్ మండలం అలియాబాద్ చౌరస్తాలోని సీఎంఆర్ కన్వెన్షన్ లో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజులు విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో పరిస్థితులు దయనీయంగా ఉండేనని, కరెంట్ ఎప్పుడు వస్తుండేనే ఎప్పుడు పోతుండెనో తెలిసేది కాదన్నారు. పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉన్న దుస్థితి మన ప్రాంతామేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై సీఎం కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని కొనియాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.